Today’s Devotional E-Paper -08-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

08/02/2019 , శుక్రవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.43AM

సూర్యాస్తమయం :6.12PM

తిథితదియ7.39AM

నక్షత్రంపూర్వాభాద్ర12.43PM

యోగంశివమ్ 9.48AM

కరణం:గరజి7.39AM
వాణి8.26PM

వర్జ్యం:11.06PM-12.50AM

దుర్ముహూర్తం
9.01AM-9.47AM
12.50PM-1.36PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

08/02/2019 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.43AM
SunSet :

6.12PM
Tithi :

Tadiya 7.39AM
Nakshatram :

Poorvabhadra 12.43PM
Yogam :

Sivam 9.48AM
Karanam :

Garaji 7.39AM
Vani 8.26PM
AmruthaGadiyalu : no

Varjyam :

11.06PM-12.50AM
Durmuhurtham 9.01AM-9.47AM
12.50PM-1.36PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 07.02.2019 :: 60,365.
 VQC SITUATION AT 5.00 AM ON 08.02.2019
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 26,
 APPROXIMATE TIME FOR SARVA DARSHAN – UPTO 18 HOUR ,
PARAKAMANI – 2.78. CRORES.
 TONSUE- 25,380. 

 

Dept of PRO TTD
 
 

08/02/2019 , Friday
02:30-03:00 hrs
Suprabhatam
03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam
04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam
06:00 – 07:00 hrs
Samarpana
07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)
09:00 – 20:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.
20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
21:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

ఫిబ్రవరి 12న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

 ఫిబ్రవరి 12వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

వాహనసేవల వివరాలు

 

సమయం వాహనం

ఉ. 7.00 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

 

ఉ. 8.30 – ఉ. 9.30 హంస వాహనం

 

ఉ. 10.00 – ఉ. 11.00 అశ్వ వాహనం

 

ఉ. 11.30 – మ. 12.30 గరుడ వాహనం

 

మ. 1.00 – మ. 2.00 చిన్నశేష వాహనం

 

సా. 6.00 – రా. 7.00 చంద్రప్రభ వాహనం

 

రా. 8.30 – రా. 9.30 గజ వాహనం

 

కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

 

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజలసేవ, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

 

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 

 

SRI PAT RADHASAPTHAMI VAHANAMS_

 

In the famous temple of Goddess Padmavathi Devi in Tiruchanoor, seven vahana sevas takes place from morning till night on February 12 on the occasion of Radhasapthami.

 

The day commences with surya prabha sahanam between 7am and 8 am followed by Hamsa Sahanam between 8.30 am and 9.30 am.

 

Later Aswa Vahanam will be observed between 10 am and 11 am followed by Garuda Vahanam between 11.30 am and 12.30 pm. The daylight vahanams concludes with Chinna Sesha Vahanam between 1pm and 2 pm.

 

While in the evening Chandra prabha Vahanam takes place between 6pm and 7pm and last vahanam, Gaja between 8.30pm and 9.30pm.

Dept of PRO TTD

JEO TIRUMALA BRIEFS DEPLOYMENT STAFF ON RADHASAPTHAMI DUTIES

Tirumala JEO Sri KS Sreenivasa Raju on Thursday evening at SVETA bhavan briefed all the TTD employees who are deployed for Radhasapthami duty in four mada streets on February 12.

He instructed all the staffs during his address that from 2015 onwards, the pilgrim rush has incredibly increased even for Radhasapthami akin to Garuda Seva and Vaikunta Ekadasi. So we have now formulated modalities and deployed a duty chart for all these occasions which will be useful even in coming years”, he added.

The JEO said along with TTD staffs, sulabh workers, srivari seva volunteers will also be rendering services in all the galleries from 4am till 10pm on the day of Radhasapthami. We have also deployed senior officers to supervise each mada street”, he added.

SE Sri Ramesh Reddy, GM Sri Sesha Reddy, SO Anna prasadam Sri Venugopal, Chief Catering Officer Sri GLN Shastry and other officers were also present.

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సనాతన ధర్మాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. హెచ్‌డిపిపి అధ్వర్యంలో నూతనంగా రూపొందించిన www.hdpp.tirumala.org వెబ్‌సైట్‌ను తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి టిటిడి ఈవో గురువారం ఉదయం టిటిడి పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ టిటిడి ధర్మ ప్రచారం కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమాలను భక్తులు సులభంగా తెలుసుకునేందుకు డిపిపి వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో ధర్మ ప్రచారకులు, భజన మండలి సభ్యులు, యువత, మహిళలు, ఔత్సాహికులు తమ సభ్యత్వాన్ని సులభంగా నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో డిపిపి కార్యక్రమల వార్షిక క్యాలెండర్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశం, వాటి విశిష్టత, ఆయా ప్రాంతాల్లోని ధర్మ ప్రచార మండళ్లు వివరాలు పొందుపర్చాపున్నారు. అదేవిధంగా పండుగలు – వాటి విశిష్టత, టిటిడి పంచాంగం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అనుబంధ ఆలయాలలో నిర్వహించే ఉత్సవాల వివరాలు, ఫోటోలు పొందుపర్చాలన్నారు.

ధార్మిక, స్పూర్తిదాయక గ్రంథాలు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ-బుక్స్‌ను భక్తులు సులభంగా అన్‌లైన్‌లో చదువుకునేలా, డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. అన్నమాచార్య సంకీిర్తనలు, ఇతర వాగ్గేయకారుల భక్తి సంకీర్తనలు భక్తులకు అందుబాటు ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికి ధర్మప్రచార కార్యక్రమాలు చేరేందుకు ఈ వెబ్‌సైట్‌ ఉపయోగ పడుతుందన్నారు. హెచ్‌డిపిపి కార్యక్రమాలకు మొబైల్‌ యాప్‌ రూపొందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఈవో టిటిడి ఐటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం, తిరుమలలో శ్రీవారిసదన్‌ ప్రాంతాలలో భక్తులకు ఉన్న లాకర్ల సదుపాయాన్ని అనుసంధానం చేసేందుకు తయారు చేసిన అప్లికేషన్‌ను త్వరితగతిన భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. తద్వారా భక్తులు ఎంచుకున్న ప్రాంతంలో లాకర్లు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. టిటిడి గత ఏడాది రూపొందించిన గోవింద మొబైల్‌యాప్‌ ద్వారా భక్తులకు అందుతున్న సమాచారం, సౌకర్యాలు, అందులోని సాంకేతిక సమస్యలను ఐటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని టిటిడి కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను వేగవంతంగా పూర్తిచేయాలని, అదేవిధంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాలలోని కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టిటిడిలో చెల్లింపులు, వివిధ శాఖలకు చెందిన టెండర్లు, వేలంలను ఆన్‌లైన్‌లోనే జరిగేవిధంగా అప్లికేషన్‌ రూపొందించాని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం టిటిడి విద్యాసంస్థలలో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా అప్లికేషన్‌ రూపొందించాలన్నారు. తద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లోనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, న్యాయాధికారి శ్రీ వెంకట రమణ నాయుడు, సిఈ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, డిపిపి కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌, డిఈవో శ్రీ రామచంద్ర, ఎస్టేట్‌ అధికారి శ్రీ విజయ సారధి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

TTD LAUNCHES DHARMA PRACHARA PARISHAD WEBSITE_

In an yet another major tech savvy move, TTD has launched separate web site for Hindu Dharma Prachara Parishad (HDPP).

The launching was done by TTD EO Sri Anil Kumar Singhal along with JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar in the former’s chambers in TTD administrative building in Tirupati on Thursday.

EO said, like in Srivari Seva, this web site would help in the easy enrollment of Dharma Pracharakas, Bhajana Mandali members, enthuse youth. The website also included the annual calendar of events, programmes, festivals and their importance of HDPP. He also instructed the IT experts to develop a mobile app also for HDPP soon.

Later, the EO discussed in length on various IT related developments and issues pertaining to various applications including lockers management in Srinivasam, Vishnu Nivasam and Srivari Seva Sadan in Tirumala. He directed the concerned to facilitate the pilgrims and volunteers to book their locker through online. The EO also reviewed on the functioning of Govinda mobile App which was launched last year by TTD.

He instructed the TCS team to quickly develop the software to book TTD kalyana mandapams spread across the country apart from AP and TS.

CVSO Sri Gopinath Jetti, DLO Sri Venkata Ramana, CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, HDPP Chief Sri Ramana Prasad, IT Chief Sri Sesha Reddy and other senior officers were also present.

Dept of PRO TTD

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 11.17 కోట్లు 

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 11.17 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 1,43,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 2,900 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.52.01 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ.18,331/-గా ఉన్నబి క్యాట‌గిరి – 2,100 కిలోలు వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.66 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

రెండో రకం తలనీలాలో కిలో రూ.17,011/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 3,100 కిలోలను వేలానికి ఉంచగా, 3,100 కిలోలు అమ్ముడుపోయాయి.తద్వారా రూ.548.35 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ.8,529/-గా ఉన్నబి క్యాట‌గిరి – 9,500 కిలోలు వేలానికి ఉంచగా 4,300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.366.79 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

మూడో రకం తలనీలాలో కిలో రూ.6,020/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 1,000 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.60.22 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,553/-గా ఉన్న బి క్యాట‌గిరి – 11,700 కిలోలు వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.55 ల‌క్ష‌ల‌ ఆదాయం సమకూరింది.

కిలో రూ.1,800/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 2,500 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.36/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,35,000 కిలోలను వేలానికి ఉంచ‌గా 1,35,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.48.62 ల‌క్ష‌ల ఆదాయం సమకూరింది.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——