Today’s Devotional E-Paper -07-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

07/02/2019 , గురువారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల
సూర్యోదయం :

6.43AM
సూర్యాస్తమయం :

6.11PM
తిథి
:

తదియ పూర్తి

నక్షత్రం
:

శతభిషం10.24AM
యోగం
:

పరిఘ
9.28AM
కరణం
:

తైతుల
6.41PM
అమృతఘడియలు
:

3.56AM-5.41AM
వర్జ్యం
:

5.24PM-7.10PM
దుర్ముహూర్తం
10.32AM-11.18AM
3.08PM-3.53PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

07/02/2019 , Thursday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.43AM
SunSet :

6.11PM
Tithi :

Tadiya Poorthi
Nakshatram :

SathaBhisham 10.24AM
Yogam :

Parigha 9.28AM
Karanam :

Taitula 6.41PM
AmruthaGadiyalu :

3.56AM-5.41AM
Varjyam :

5.24PM-7.10PM
Durmuhurtham 10.32AM-11.18AM
3.08PM-3.53PM

 
*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 06.02.19: 63,394 ,
V.Q.C SITUATION AT 05:00 AM ON 07.02.2019 
NO. OF COMPARTMENTS. WAITING IN VQC-II: 01,
APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO TO 06 HOURS.
 TONSURES – 19,840.
PARAKAMANI – 3.03 CR. 
Dept of PRO TTD
 
 
 

07/02/2019 , Thursday
06:00 – 08:00 hrs
Tiruppavada
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell
08:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell
21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

 రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జెఈవో

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్రవరి 12వ తేదీన జ‌రుగ‌నున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌య మాడ వీధుల్లో చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు బుధ‌వారం ప‌రిశీలించారు.

 

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఉద‌యం 5.30 గంట‌లకు సూర్యప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి 9.00 గంట‌ల వ‌ర‌కు వ‌రుస‌గా చిన్న‌శేష‌, గ‌రుడ‌, హ‌నుమంత వాహ‌నాలు, చ‌క్ర‌స్నానం, క‌ల్ప‌వృక్ష‌, స‌ర్వ‌భూపాల‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌నాల‌పై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు. భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు, వ‌ర్షానికి ఇబ్బందులు ప‌డ‌కుండా గ్యాల‌రీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు టి, కాఫి, పాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తామ‌న్నారు. మాడ వీధుల్లో ఉన్న దాదాపు 170 గ్యాల‌రీల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌కు 55 ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. భ‌క్తులకు సేవ‌లందించేందుకు 300 మంది సిబ్బందికి డెప్యుటేష‌న్ విధులు కేటాయిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. ప్ర‌తి గ్యాల‌రీలో శ్రీ‌వారి సేవ‌కులు, ఆరోగ్య సిబ్బంది ఉంటార‌ని, సీనియ‌ర్ అధికారుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని తెలిపారు. భ‌క్తులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి గ్యాల‌రీల్లో వేచి ఉండి వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించాల‌ని కోరారు. భ‌క్తులు వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు వీలుగా 20 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌ల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు ప‌రిమితం చేశామ‌ని తెలిపారు. దివ్య‌ద‌ర్శ‌నం, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నాలు కొన‌సాగుతాయ‌న్నారు.

 

ముందుగా గ్యాల‌రీల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. మాడ వీధుల్లో తీర్చిదిద్దుతున్న రంగ‌వ‌ల్లుల‌ను ప‌రిశీలించారు.

 

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డిఇ శ్రీమ‌తి స‌ర‌స్వ‌తి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, పేష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు, యూనిట్ ఆఫీస‌ర్ శ్రీ శ్రీ‌నివాస‌మూర్తి, ఎవిఎస్‌వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ చిరంజీవులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

JEO INSPECTS RADHASAPTHAMI ARRANGEMENTS_

Tirumala JEO Sri KS Sreenivasa Raju on Wednesday noon inspected the ongoing arrangements for Radha Sapthami in four mada streets surrounding Tirumala temple.

 

Later speaking to media persons, the JEO said, Sri Malayappa Swamy, the utsava deity will take celestial ride on seven different vahanams from morning to evening on a single day on February 12. The vahanam spree will commence with Surya Prabha Vahana seva in the morning at 5.30am and concludes with Chandra Prabha Vahana Seva in the night at 9pm.

 

“For nearly 18 hours all the staff who are deployed in mada streets will discharge their duties. Apart from the regular staff, about 3000 srivari sevakulu will also render services to pilgrs who will be waiting in 170 galleries spread in all four mada streets. The Anna prasadam wing has also set up 55 food courts to distribute food to pilgrims. The continuous cleaning by health department during interval time is also crucial”, he said.

 

The JEO said to shield pilgrims waiting in galleries from inclement weather conditions, the engineering wing has also set up temporary shed with protective covers.

 

SE 2 Sri Ramachandra Reddy, VGO Sri Manohar, Special Officer Anna prasadam Sri Venu Gopal, Chief Catering Officer Sri GLN Shastry, Temple Peishkar Sri Ramesh and others were also present.

 

 

Dept Of PRO TTD

ఒంటిమిట్ట బ్రహ్మూత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం బ్రహ్మూెత్సవాలలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి బుధవారం ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.60.40 కోట్లతో శాశ్వత కల్యాణవేదిక, మరుగుదొడ్లు తదితర పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గత జనవరి 2వ తేది పరిశీలించానన్నారు. అందులో భాగంగా గత నెల తనిఖీలకు, ఈరోజు పరిశీలనలో చాలా పురోగతి ఉందన్నారు. మరోసారి మార్చి 7వ తేది వచ్చి అభివృద్ధి పనులను పరిశీలిస్తానన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ సిబ్బందిని తెప్పించుకోవాలన్నారు.

ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాలకు ఏప్రిల్‌ 12న అంకురార్పణ జరుగనుందని, ఏప్రిల్‌ 18న శ్రీరాములవారి కల్యాణం, ఏప్రిల్‌ 22వ తేది పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా బ్రహ్మూెత్సవాలలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అవసరమైన తాత్కలిక ఏర్పాట్లను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీ కోదండరామప్వామివారి ఆలయం, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ పి. కోటేశ్వర రావు, రాజంపేట ఆర్డీవో శ్రీ కోదండరామి రెడ్డిల, ఇతర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డిప్యూటీ ఈవో శ్రీ నటేష్‌ బాబు, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ రవిశంకర్‌ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్‌, ఏఈవో శ్రీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

REGULAR INSPECTIONS TO SPEED UP VONTIMITTA DEVELOPMENT WORKS-TTD EO_

 

To speed up major development works in Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district, before annual brahmotsavams, regular inspections will be carried out, said TTD EO Sri Anil Kumar Singhal.

 

Speaking to media here on Wednesday after inspecting the ongoing developmental works along with Tirupathi JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and CE Chandrasekhar Reddy, he said, the construction works at Kalyana Vedika are going on a fast pace. “During last month on January 2, we instructed the work contractors to complete all the construction of permanent structures before Brahmotsavams in second week of April here. Apart from this, the beautification and greenery works taken up Forest department will also be completed. Next month there will be another round of inspection by senior officers of TTD on March 7”, he added.

 

The EO said out of the Rs.100 crores works, already development works at a cost Rs.60.40crores have taken up which included construction of permanent Kalyana Vedika, toilets etc. The deployment of staff to the temple, infrastructure works etc. issues will be discussed in the TTD Board Meeting on February 19 in detail”, he added.

 

The EO further said, the annual brahmotsavams will commence on April 12 with Ankuarpanam while the big event Sita Rama Kalyanam will take place on April 18 and Pushpa yagam on April 22.

 

Suptd Engineers Sri Ramesh Reddy, Sri Venkateswarlu, DyCF Sri Phanikumar Naidu, Estate Officer Sri Vijay Sarathi, Temple DyEO Sri Natesh Babu, AEO Sri Ramaraju, Executive Engineer Sri Jaganmohan Reddy, Des Sri Ravishankar Reddy, Sri Chandrasekhar, Addl Health Officer Dr Sunil and others took part.

 

Later he reviewed the developmental works of Vontimitta Temple with Joint Collector, Kadapa, Sri P Koteswara Rao IAS, RDO of Rajampeta Sri Kodandarami Reddy at Vontimitta.

 

 

ఫిబ్రవరి 8 నుంచి 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

 టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

 

పశ్చిమ గోదావరి జిల్లా..

– ఫిబ్రవరి 8వ తేదీన కుక్కునూరు మండలం బనగాల గూడెం గ్రామంలో గల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయ పరిసరాల్లో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– ఫిబ్రవరి 9న బుట్టయ్యగూడెం మండలం గుర్రప్ప గూడెం గ్రామంలో గల శ్రీకోదండరామలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.

– ఫిబ్రవరి 10న జంగారెడ్డిగూడెం మండలం పెద్దకప్పగూడెం గ్రామంలో గల శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకుసాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఫిబ్రవరి 11న టి.నరసాపురం మండలం రుద్రరాజుకోట గూడెం గ్రామంలో గల శ్రీకోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఫిబ్రవరి 12న కామవరపుకోట మండలం శ్రీ కోదండరామ నగర్‌ గ్రామంలో శ్రీకోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.

తూర్పు గోదావరి జిల్లా..

– ఫిబ్రవరి 15న రాజవోమంగి మండలం రేవటిపాళ్యం గ్రామంలోని శ్రీ గంగాలమ్మతల్లి ఆలయ పరిసరాల్లో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఫిబ్రవరి 16న అడ్డతీగల మండలం వేటమమ్మిడి గ్రామంలోని శ్రీ రేణుక యలమ్మతల్లి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఫిబ్రవరి 17న దేవిపట్నం మండలం రాయవరం గ్రామంలోని శ్రీ రామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది.

– ఫిబ్రవరి 18న కూన‌వ‌రం మండలం టెక్కలబోరు గ్రామంలోని శ్రీ అయప్పస్వామివారి ఆలమంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.

– ఫిబ్రవరి 19న యాటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.

నెల్లూరుజిల్లా..

– ఫిబ్రవరి 20న కొడవలూరు మండలం కమ్మపాళ్యం గ్రామంలోని శ్రీ మహాలక్షి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

SRINIVASA KALYANAMS FROM FEB 8 TO 11

Series of Srinivasa Kalyanams will be observed from February 8 to 20 under the aegis of Srinivasa Kalyanotsavam Project of TTD in 11 places of AP.

 

The district covered under this are East Godavari, West Godavari, Sri PottiSriramulu Nellore districts.

 

The project special officer Sri Prabhakara Rao is supervising the arrangements.

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——