Problems of Tirumala Local People were Solved nearly 80%

Problems of Tirumala Local People were Solved nearly 80%

Problems of Tirumala Local People were Solved nearly 80%

Problems of Tirumala Local People were Solved nearly 80%
Problems of Tirumala Local People were Solved nearly 80%

*ఫ్లాష్.. ఫ్లాష్… ఫ్లాష్…*

*తిరుపతి MLA సుగుణమ్మ, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రా రెడ్డి, తుడా చైర్మెన్ నరసింహ యాదవ్ గార్ల చొరవతో దాదాపుగా పరిష్కారమైన తిరుమల స్థానికుల సమస్యలు*

*టిటిడి పాలకమండలి ముందు ప్రతిపాదనలలో దాదాపుగా 80% పరిష్కారానికి ఒప్పుకున్నటి.టి.డి అధికారులు.*

ఎన్నో ప్రభుత్వాలు మారినా, నాయకులు, ప్రజాప్రతినిధులు మారినా…. ఎన్నో సంవత్సరాలనుండి అపరిష్కృతంగా ఉన్నతమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… గత వారం రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ముందు అవిశ్రాంతంగా ధర్మ పోరాటం చేస్తున్న తిరుమల స్థానికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు తిరుపతి స్థానిక MLA సుగుణమ్మ, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రా రెడ్డి, తుడా చైర్మెన్ నరసింహ యాదవ్ గార్ల చొరవతో టిటిడి ఉన్నతాధికారులు తిరుమల స్థానికులతో ఈరోజు సాయంత్రం 04 -30 గంటలనుండి చర్చలు జరిపారు.

దాదాపుగా 4 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో తిరుపతి స్థానిక MLA సుగుణమ్మ, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రా రెడ్డి, తుడా చైర్మెన్ నరసింహ యాదవ్, టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, హెల్త్ ఆఫీసర్ షర్మిష్ట, ఎస్టేట్ ఆఫీసర్ తదితరులతోపాటు తిరుమల సంక్షేమ సంఘం నాయకులైన పదిమంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందులో స్థానికులు వ్యాపారులతో టిటిడి అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూలంకషంగా చర్చించారు. ముఖ్యంగా సంక్షేమసంఘం నాయకులు ప్రతిపాదించిన 19 డిమాండ్లను అధికారులు అంశాలవారీగా పరిశీలించారు.

ఇందులో కొండపై దుకాణాలు, బాలాజీ నగర్ లోని ఇళ్ళు వాటి పేర్ల మార్పిడి అంశాన్ని, ఆర్ బి సెంటర్లోని నిర్వాసితులకు బాలాజీ నగర్ లో పునరావాసం కల్పించే అంశాన్ని, కొండపై దుకాణాలు, హాకర్ లైసెన్సులు వాటి అద్దెలను ప్రతి ఏడాది పెంచే అవకాశం లేకుండా స్టాండర్డ్ రెంట్ నిర్ణయించే అంశాన్ని ఈ నెల 19న జరిగే టిటిడి పాలకమండలి సమావేశం ముందు ఉంచి సత్వరమే ఆమోదిస్తామని టి.టి.డి అధికారులు తిరుమల స్థానికులకు హామీ ఇచ్చినట్లు సమాచారంఅందుతోంది.

టెండరు షాపుల విషయంలో అంగీకారాన్ని తెలిపినా పాలకమండలి సబ్ కమిటి అనుమతి తప్పదని తేల్చారు. ఇంకా కొన్ని స్వల్ప అంశాలపై సమీప భవిష్యత్తులో చర్చలు జరిపి అతి త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని టి.టి.డి అధికారులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమించిన తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రా రెడ్డి, తుడా చైర్మెన్ నరసింహ యాదవ్ గారితోపాటు, సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆధికారులకు మరియు పార్టీలకతీతంగా తమకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ తిరుమల సంక్షేమ సంఘ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.