Today’s Devotional E-Paper -05-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

05/02/2019 ,మంగళవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :

6.44AM

సూర్యాస్తమయం :

6.10PM

తిథి:మాఘ శుద్ధ పాడ్యమి3.36AM

నక్షత్రం:ధనిష్ఠ పూర్తి

యోగం
:

వ్యతి
8.26AM

కరణం
:

కింస్తు
2.31PM
బవ
3.36AM

అమృతఘడియలు :8.19PM-10.06PM

వర్జ్యం :9.40AM-11.27AM

దుర్ముహూర్తం
9.01AM-9.47AM
11.12PM-12.21AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

05/02/2019 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Magha Masam

Paksham :

Sukla

SunRise :

6.44AM

SunSet :

6.10PM

Tithi :

Magha Suddha Padyami 3.36AM

Nakshatram :

Dhanishta Poorthi

Yogam :

Vyathi 8.26AM

Karanam :

Kimsthu 2.31PM
Bava 3.36AM

AmruthaGadiyalu :

8.19PM-10.06PM

Varjyam :

9.40AM-11.27AM

Durmuhurtham 9.01AM-9.47AM
11.12PM-12.21AM

 
 

05/02/2019 , Tuesday
06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell
07:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 
00:45 hrs
Ekanta Seva

 

 

 

 

 ఫిబ్ర‌వ‌రి 5న వృద్ధులు, దివ్యాంగులకు, 6న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

 

ఇందులోభాగంగా ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

 

5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

SENIOR CITIZENS, DIFFERENTLY ABLED DARSHAN ON FEBRUARY 5, PARENTS WITH CHILDREN BELOW 5YEARS OLD ON FEBRUARY 6_

 Tirumala Tirupati Devasthanams (TTD) has allotted darshan on two days during lean season of a month to the pilgrims falling in the categories of senior citizens and physically challenged and also for parents with children below five year old.

 

During this month, TTD has given darshan dates to senior citizens and physically challenged on February 5 while the second phase darshan for this category of pilgrims will be provided on February 19. Four thousand tokens will be issued in three slots on Tuesday. At 11am slot 1000 tokens, 2pm slot 2000 tokens and 3pm slot 1000 tokens will be issued.

 

While the parents with children below 5years of age, will be provided darshan on February 6 and again on February 20 through Supatham Entry between 9am and 1.30pm by TTD on these two days.

 

శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సోమవారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది.

 

ఆలయంలో ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లకు సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.

 

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ శ్రీధర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

ఫిబ్రవరి 12న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 12వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనంపై శ్రీకోదండరామస్వామివారువారు ఊరేగనున్నారు.

 

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7.00 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

 

RADHASAPTHAMI IN SRI KRT ON FEB 12_

The temple of Sri Kodanda Rama Swamy in Tirupati is gearing up for the big occasion, Radhasapthami on February 12.

 

As a part of this event, lord will take pleasure ride on Suryaprabha Vahanam in the morning on that day at 8am and on Chandraprabha Vahanam in the evening at 7pm.

 

Meanwhile while Sahasra Kalasabhishekam and Hanumantha Vahanam observed in the temple on Monday.

 

_ తిరుమలలోని ఎస్వీ ప్రదర్శనశాల సుందరీకరణకు టెండర్లు అహ్వానం

కలియుగ వైకుంఠమైన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రదర్శనశాల(మ్యూజియం)ను మరింత సుందరంగా రూపొందించేందుకు అనుభవం గల ఏజెన్సీల నుండి టెండర్లు అహ్వానించడమైనది. ఇందులో భాగంగా మ్యూజియంలోని వివిధ గదులను అకర్షణీయంగా రూపొందించాల్సి ఉంటుంది.

 

ఆశక్తి గల ఏజెన్సీలు ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలలోపు రూ.10,000-ఈఎమ్‌డితో, సంబంధిత రంగంలో అనుభవం కలిగిన ధృవపత్రాలతో అప్లికేషన్‌ పంపవలెను. ఇతర వివరాలకు www.tirumala.org, ttd.svmuseum@gmail.com, tirumala.org, hyd@tirumala.org,, సెల్‌-9701793210, ఫోన్‌ – 0877 -2263491 సంప్రదించగలరు.

 

TENDERS INVITED FOR MUSEUM DEVELOPMENT WORKS

To provide interior design for the SV Museum hall in Tirumala works and fixing agency towards the execution of the works, tenders have been invited by TTD.

Eligible interior designers or architects with 10 years experience and reputation shall apply before February 7 by 3pm and submit the tender forms along with an EMD for an amount of Rs.10,000 as Demand Draft taken from any scheduled bank drawn in favaour of Executive Officer, TTD, Tirupati.

For further information, contact, www.tirumala.org, mail id: ttdsvmuseum@gmail.com, Mobile: 9701793210, Ph.No.0877 2263491.

 

 వేసవి రద్దీ నేపద్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అవసరమైన నీటి సరఫరాచేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సర్వదర్శనం క్యూలైన్లలో ప్రవేశ మార్గాలలో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని తేలుసుకునేందుకు వీలుగా డిస్‌ప్లే బోర్డులు, ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేయాలన్నారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు వారికి దర్శన సమయం, అన్నప్రసాదాలు పంపిణి, లడ్డూ ప్రసాదాలు తదితర సమాచారాన్ని అందించేలా అన్ని విభాగాల సిబ్బందితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భక్తులు క్యూలైన్‌ ఆరంభంలోనే తమకు ఎన్ని గంటలలోపు దర్శనం అవుతుందో ముందస్తుగానే తెలిసే అవకాశం ఉంటుదన్నారు.

తిరుమలలోని ఎస్‌వి మ్యూజియంను దశల వారిగా అభివృద్ధిచేయాలన్నారు. అదేవిధంగా తిరుపతిలోని మ్యూజియంను చారిత్రక సంపదగా తీర్చిదిద్ధాలని, తిరుచానూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి వసతి సమూదాయంలో భక్తులను ఆకట్టుకునేలా చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో టిటిడి కల్యాణమండపాలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించామని, అదేతరహలో ఇతర ప్రాంతాలలోని కల్యాణ మండపాలను బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ రూపొందించాలన్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ధర్మ ప్రచార మండలి, భజన మండలి సభ్యులు తమ పేర్లు, కార్యక్రమాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ రూపొందించాలన్నారు.

 

టిటిడి స్థానిక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులుగా నియమించిన టిటిడి సీనియర్‌ అధికారులు తరచు సంబంధిత ఆలయాలను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాలలో సిసిటివిలు ఏర్పాటు చేసి, భద్రత మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తులు వేసవిలో ఎండకు, వర్షానికి ఇబ్బందిలేకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారిలో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వెలుపల ఉన్న మార్గాలలో షెల్టర్‌లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంపీణి జరుగుతున్న ప్రాంతంలో భక్తులకు ఇబ్బంది లేకుండా సివిల్‌ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

TIRUCHANOOR PAC TO HAVE A MINI MUSEUM _

The new Pilgrim Amenities Complex (PAC) which is set ready at Tiruchanoor will have a mini museum to showcase the grandeur of Tirumala, Tirupati and Tiruchanoor soon.

 

During the senior officers meeting held at TTD Administrative Building in Tirupati, the EO Sri Anil Kumar Singhal said, the Tirumala museum should be developed in a phased manner while the one Tirupati should be revived as a historical structure, he instructed the concern. He also said, one mini museum shall also be planned at the upcoming Sri Padmavathi PAC in Tiruchanoor.

 

As the summer holidays will be approaching in couple of months, the EO instructed the concerned officers to make arrangements to ensure that there is no scarcity of water, shortage of laddus etc. for the pilgrims. He directed that a separate special cell need to be set up in Vaikuntham Queue Compelx with all the departments to feed relevant information viz.releasing time of compartments, menu of annaprasadams, about laddu prasadams etc. in the LED display screens for better understanding of the pilgrims, he maintained.

 

Akin to Chittoor District, where all TTD Kalyana Mandapams are made online, the same system need to be developed to others also located across the country, he instructed. He directed all the senior officers who are also allotted one local temple to see overall development, should visit their respective temples regularly and prepare an action plan on their observations, he added.

 

JEOs Sri K S Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti, CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji were also present.

 

అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనల సిడి ఆవిష్కరణ

శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనల సిడిని ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

 

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనలను శ్రీ కె.రామాచారి స్వరపరచగా చిరంజీవి శ్రీ యశస్వి నందపరీక్‌ గానం చేశారు.

 

ఈ సందర్భంగా శ్రీ కె.రామాచారిని, శ్రీ యశస్వి నందపరీక్‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

 

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

 

ANNAMAIAH CDs RELEASED_ ”

On the occasion of Sravana Nakshatra, the birth star of Lord Venkateswara, Annamaiah CDs were released in Annamacharya Kalamandiram at Tirupati on Monday evening.

 

Annamaiah Venkatesa Krupa CD was released with songs sung by Sri K Ramachari and Chi.Yasasvi Nandapareekh. Later they rendered the songs and enthralled the audience.

 

SV Recording Project Special Officer Sri P Munirathnam Reddy was also present.

 

Dept Of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——