Today’s Devotional E-Paper -04-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

04/02/2019 , సోమవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.44AM

సూర్యాస్తమయం :6.30PM

తిథి:అమావాస్య1.26AM

నక్షత్రం:శ్రవణం5.14AM

యోగం:సిద్ధి7.56AM

కరణం:చతు12.26PM
నాగం1.26AM

అమృతఘడియలు:5.45PM-7.31PM

వర్జ్యం:7.09AM-8.55AM

దుర్ముహూర్తం
12.50PM-1.36PM
3.07PM-3.53PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

04/02/2019 , Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Magha Masam

Paksham :

Sukla

SunRise :

6.44AM

SunSet :

6.30PM

Tithi :

Amavasya 1.26AM

Nakshatram :

Sravanam 5.14AM

Yogam :

Siddhi 7.56AM
Karanam :

Chathu 12.26PM
Nagana 1.26AM

AmruthaGadiyalu :

5.45PM-7.31PM

Varjyam :

7.09AM-8.55AM

Durmuhurtham 12.50PM-1.36PM
3.07PM-3.53PM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 03.02.2019:: 68,914.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 04.02.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 02 ,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 04 HOURS. 
PARAKAMANI – RS. 2.66 CRORES.
Dept of PRO TTD
 
 

04/02/2019 , Monday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

 

05:30 – 06:30 hrs
Visesha Puja

 

07:00 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

 

ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు

టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.
– 41 నుంచి 50 ఏళ్లలోపు పురుషుల స్వీమింగ్‌ పోటీల్లో శ్రీ య‌ర్రంరెడ్డి మొద‌టి స్థానం, శ్రీ రెడ‌ప్ప 2వ స్థానం, శ్రీ గోవిందు 3వ స్థానంలో నిలిచారు.
– 40 ఏళ్లలోపు పురుషుల స్వీమింగ్‌ పోటీల్లో పోటీల్లో శ్రీ మ‌ల్లికార్జున మొద‌టి స్థానం, శ్రీ చ‌క్ర‌వ‌ర్తి 2వ స్థానం, శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌ 3వ స్థానంలో నిలిచారు.
– టిటిడి విశ్రాంత ఉద్యోగుల పురుషుల బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో కె.రామమూర్తిరెడ్డి జట్టు విజేతగా నిలవగా, శ్రీ భాస్క‌ర్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– బధిర పురుషుల క్యారమ్స్‌ సింగల్స్‌ పోటీల్లో శ్రీ శ్రీకాంత్‌ విజయం సాధించగా, శ్రీ మ‌ధుసూద‌న శ‌ర్మ‌ రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్‌ డబుల్స్‌ పోటీల్లో శ్రీ సునీల్‌కుమార్‌, శ్రీ మధుసూదనశర్మ జట్టు విజయం సాధించగా, శ్రీ ఐ.సాయప్రసాద్‌, శ్రీ మ‌ల్లిఖార్జున‌ జట్టు రన్నర్స్‌గా నిలిచారు.

 

– బధిర మహిళల క్యారమ్స్‌ సింగల్స్‌ పోటీల్లో శ్రీమ‌తి సంపూర్ణ‌ సాధించగా, శ్రీమ‌తి కుమారి రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్‌ డబుల్స్‌ పోటీల్లో శ్రీమ‌తి కుమారి, శ్రీమ‌తి ప్ర‌సున్న జట్టు విజయం సాధించగా,శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి, శ్రీ‌మ‌తి సంపూర్ణ‌మ్మ‌ జట్టు రన్నర్స్‌గా నిలిచారు.
– ప్ర‌త్యేక ప్ర‌తిభ‌వంతుల పురుషుల చెస్‌ పోటీల్లో శ్రీ ర‌వికుమార్ విజేతగా నిలవగా, శ్రీ స‌త్యం రన్నరప్‌గా నిలిచారు.

 

 

భగవన్నామస్మరణతో కష్టాలు దూరం: శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ

 

పెద్ద దూదికొండనైనా చిన్న అగ్నికణం దహించేస్తుంది అన్నట్టు ఎంతటి కష్టాన్నైనా భగవన్నామస్మరణ దూరం చేస్తుందని కోలార్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలలోని ఆస్థానమండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ సందర్భంగా కోలార్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందించారు. కలియుగంలో భగవంతుని నామసంకీర్తనమే ముక్తికి మార్గమని పేర్కొన్నారు. పురందరదాసుల వారు తన జీవితాన్ని దాస కీర్తనల రచనకే అంకితం చేశారని చెప్పారు. దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్తాన్ని, శరణాగతి విధానాన్ని, నరుడు-నారాయణడు మధ్యగల సంబంధాన్ని తెలియజేశారని అన్నారు. మనకు మానవజన్మ ఇచ్చి భగవంతుడు ఉపకారం చేశాడని, ధర్మాచరణ ద్వారా ఆయనకు మనం ప్రత్యుపకారం చేయాలని సూచించారు.

 

అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ”గురుపురందర దాసరే…., వండిదే పురందరదాసర….” తదితర సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు.

 

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

 

ఫిబ్రవరి 4న నారాయణగిరి ఉద్యానవనంలో సంకీర్తనాలాపన :

 

ఫిబ్రవరి 4వ తేదీన సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడ పురందరదాసుల సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న తిరుమలలోని ఆస్థానమండపంలో భజన కార్యక్రమాలు, నగర సంకీర్తనం, హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమాలు చేపడతారు.

 

 

CHANTING BHAGAVATNAMA IS ULTIMATE WAY TO SALVATION-SEER

 The pontiff of Sri Thambihalli Mutt of Kolar district in Karnataka, HH Sri Vidhya Sindhu Madhava theerta swami said the easy way for salvation in Kaliyuga is through chanting divine names of Lord.

 

The Purandhara Dasa Aradhana mahotsavam commenced on a religious note in Asthana Mandapam at Tirumala on Sunday. The seer who took part in this fete, during his spiritual address said that as a small spic of fire will burn to ashes a huge heap of cotton, in a similar manner, the chanting of divine names will we throw away our difficulties”, he added.

 

Dasa Sahitya Project Special Officer Sri P Anandateerthacharyulu, over 3000 dasa bhaktas hailing from AP, TS, TN, Karnataka and Maharashtra were also present.

 

Meanwhile there will be Inka Seva of deities in Narayanagiri Gardens on Monday evening.

 

 

వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో జెఈఓ పరిశీలన

తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆదివారం పరిశీలన చేపట్టారు. 17వ కంపార్ట్మెంట్ లోని ఎల్ఇడి డిస్ప్లే తెరలను పరిశీలించి భక్తులకు మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్ఇ ఎలక్ట్రికల్స్ శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విఎస్వో శ్రీ మనోహర్, డిఇ శ్రీమతి సరస్వతి, డెప్యూటి ఇఇ శ్రీమతి రమాదేవి, ఇడిపి ఓఎస్డి శ్రీ భాస్కర్ , ఎవిఎస్వో శ్రీ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

JEO INSPECTS DISPLAY BOARDS IN VQC

Tirumala JEO Sri KS Sreenivasa Raju on Sunday afternoon inspected the display boards in Vaikuntham Queue Complex 2 in Tirumala.

 

Later he instructed the concerned to display information which is neede to the pilgrims while waiting in the compartments.

 

He said the information about compartment release time should be updated by the concerned at VQC 1 and 2 from time to time.

 

Temple DyEO Sri Harindranath, VGO Sri Manohar, SE Electrical Sri Venkateswarulu and others were also present.

 

Dept Of PRO TTD

 త్వరలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ నగలు రికవరీకి చర్యలు చేపట్టాం- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కనిపించకుండా పోయిన 3 బంగారు కిరీటాలను త్వరలో రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్ , సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టీ , పోలీస్‌ అధికారులతో కలిసి ఆలయాన్ని ఈవో పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ గోవిదంరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు అలంకరించే 3 కిరీటాలు శనివారం సాయంత్రం నుండి కనబడుటలేదని అర్చకులు తెలియజేశారన్నారు. ఈ విషయమై టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ అదికారులు గత రెండు రోజుల సిసి టివి రికార్డును క్షుణ్ణంగా పరిశీస్తున్నారని తెలిపారు. ఆలయంలోని సిసిటీవీలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయని, త్వరలో స్వామివారి నగలను రికవరీ చేసేందుకు టిటిడి విజిలెన్స్, తిరుపతి పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డి,సిఈ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , ఎఫ్ ఏసిఏవో శ్రీ ఓ. బాలాజీ , స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, టిటిడి అధికారులు, తిరుపతి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

EO INSPECTS SRI GT_

 Following the theft of three crowns in the temple of Sri Govinda Raja Swamy (Sri GT) in Tirupati, TTD EO Sri Anil Kumar Singhal inspected the temple on Sunday evening.

 

Later speaking to media persons, the EO said, three crowns belonging to Sri Kalyana Venkateswara Swamy, the sub-shrine located in Sri GT. All three weighing approximately 1351grams costing around Rs.50lakhs”, he said.

 

The EO said, as soon as the duty archakas identified the missing of these crowns our senior officers including JEO Sri P Bhaskar and CVSO Sri Gopinath Jetti rushed to the temple and enquired the staffs. On total there were 15 cameras in the temple and all are functioning properly. The vigilance staff of TTD has also given CC TV footage to police for further investigation. In next two or three days we may get the final report of investigation”, EO added.

 

FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Suptd Engineer Sri Ramulu and others were present.

 

Dept Of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——