Today’s Devotional E-Paper -03-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

03/02/2019 , ఆదివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.44AM

సూర్యాస్తమయం :6.30PM

తిథి:చతుర్దశి11.26PM

నక్షత్రం
:

ఉత్తరాషాఢ
2.44AM

యోగం :వజ్రం7.38AM

కరణం: భద్ర10.34AM
        శకుని11.26PM

అమృతఘడియలు:7.44PM-9.29PM

వర్జ్యం:9.14AM-10.59AM

దుర్ముహూర్తం
4.39PM-5.24PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

03/02/2019 , Sunday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.44AM
SunSet :

6.30PM
Tithi :

Chathurdasi 11.26PM
Nakshatram :

Uttarashada 2.44AM
Yogam :

Vajram 7.38AM
Karanam :

Bhadra 10.34AM
Sakuni 11.26PM
AmruthaGadiyalu :

7.44PM-9.29PM
Varjyam :

9.14AM-10.59AM
Durmuhurtham 4.39PM-5.24PM

 

 

03/02/2019 , Sunday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

TTD TO RELEASE MAY QUOTA OF Rs.300 TICKETS ON FEB 5_

 

The online quota of Rs.300 Special Entry Darshan tickets will be released by TTD on February 5.

 

The pilgrims can book these tickets in online, e-Darshan counters and post offices also.

 

 

ఫిబ్ర‌వ‌రి 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మే నెల కోటా విడుదల

ఫిబ్ర‌వ‌రి 02, తిరుమల 2019: భక్తుల సౌకర్యార్థం 2019 మే నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్ర‌వ‌రి 5న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

 

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Dept Of PRO TTD

SAPTHAGIRISHA TO HAVE SAPTHA VAHANA SEVA ON FEBRUARY 12_

The Lord of Seven Hills, Sri Venkateswara Swamy is gearing up to take a pleasure ride on Seven Vehicles on the auspicious day of Radha Sapthami on February 12.

 

Sri Malayappa Swamy, the Utsava deity of Lord Venkateswara is mounted on seven different vahanams on this festival day and glides along the mada streets from morning to evening and hence this fete 0is also considered as Upa Brahmotsavams. Sri Malayappa Swamy as Surya Narayana Murthy takes the first ride on Suryaprabha Vahanam and this vahanam is considered to be the most important one of all the seven vahana sevas of the day as the festival is specially observed as “Surya Jayanthi”.

 

Following this festival, TTD has cancelled all arjitha sevas for the day including Asta Dala Pada Padmaradhana, Kalyanotsavam, Unjal Seva, arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara sevas while suprabhatam, thomala and archana will be observed in Ekantam.

 

The privilege darshans like Senior Citizens, Physically Challenged, NRIs, Donors through Supatham entry were also cancelled on this day keeping in view the huge influx of pilgrims for the occasion.

 

Vahana Seva Time

Suryaprabha Vahanam 5.30am to 8am
Chinna Sesha Vahanam 9am to 10am
Garuda Vahanam 11am to 12Noon
Hanumantha Vahanam 1pm to 2pm
(Chakra Sananam 2pm to 3pm)
Kalpavriksha Vahanam 4pm to 5pm
Sarva Bhoopala Vahanam 6pm to 7pm
Chandraprabha Vahanam 8pm to 9pm

 

ఫిబ్రవరి 12న రథసప్తమినాడు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు

తిరుమల, 2019 ఫిబ్రవరి 02: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

 

ఇందులో భాగంగా చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని వ్యవహరిస్తారు.

సమయం వాహనం

ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది)

ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం

ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం

మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం

సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం

సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం

రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

Dept Of PRO TTD

క్రీడలతోనే శారీరక, మానసిక ప్రశాంతత : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

 

టిటిడిలో ఉద్యోగులు పని ఒత్తిడి, మానసిక ప్రశాంత, శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా భక్తులకు విశేష రీతిలో సేవలు అందించడానికి క్రీడలు దోహదపడతాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్‌ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు -2019 శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి కట్టుబడి ఉందని, ఇందుకోసం అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఉద్యోగులు ప్రతిరోజూ దైనందిన జీవనంలో కొంత సమయం ఏదో ఒక క్రీడను సాధన చేయాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు విధుల్లోనూ చురుగ్గా ఉంటారని అన్నారు. క్రీడాస్ఫూర్తితో విధులను నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులందరూ పాల్గొని క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని జెఈవో కోరారు.

 

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ టిటిడిలో 1977వ సంవత్సరంలో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈసారి పురుషులు, స్త్రీల విభాగంలో 40 సం||రాల లోపువారికి, 41 నుంచి 50 సం||లోపువారికి, 50 సం||రాల పైబడిన వారికి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. క్రీడాపోటీల్లో మొదటిస్థానం పొందినవారికి రూ.1800/-, రెండో స్థానం పొందినవారికి రూ.1600/-, మూడో స్థానం పొందినవారికి రూ.1400/- విలువగల గిఫ్ట్‌ కార్డులు బహుమతులుగా అందిస్తామన్నారు. పురుషుల విభాగంలో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, కబడ్డీ, మహిళల విభాగంలో టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జిబాల్‌, కబడ్డి, పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

 

ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మ‌ధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంత‌రం జాతీయ జెండాను, క్రీడోత్సవాల జెండాను జెఈవో ఆవిష్కరించి, శాంతికపోతాలను, బెలూన్లను ఎగురవేశారు. ముందుగా పలు విభాగాల ఉద్యోగులు కవాతు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రార్థన చేశారు.

 

ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, డెప్యూటీ ఈవోలు శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ దేవేంద్రబాబు, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వర్‌, శ్రీ సురేంద్ర, వ్యాఖ్యాత డా|| పెన్నా భాస్కర్‌, అన్ని విభాగాల ఆధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Dept Of PRO TTD

JEO STARTS OFF TTD SPORTS MEET_

Tirupathi JEO Sri P Bhaskar on Saturday started off the TTD annual sports and games meet in a grand manner.

 

Speaking on the occasion he said, TTD employees have been struggling hard day and night to meet the needs of tens of thousands of pilgrims every day. To relieve from the work stress and too keep the body more active, sports will help a lot. So TTD has been organising this sports meet as an annual event since 2014 in the month of February. By taking part in this sports we can able render services to visiting pilgrims in a better way with more enthusiasm”, he added.

 

The pledge was delivered by Sri Ashok Kumar Goud, VGO Tirupati while Smt Hemalatha, DyEO Welfare office presented the annual report.

 

Later the JEO declared the sports and cultural meet as open by flewing away a dove. He formally commenced the sports meet by taking part in Tug of War game.

 

FMS EE Sri Mallikarjuna Prasad, DyEO Sri Devendra Babu were also present.

 

 

Dept Of PRO TTD

అమరావతిలో వైభ‌వంగా శ్రీవారికి స్న‌ప‌న తిరుమంజ‌నం

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూక‌ర్ష‌ణంలో భాగంగా శ‌నివారం ఉద‌యం స్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా జ‌రిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు టిటిడి ఆధ్యాత్మిక, ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.

 

ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం 11.00 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంట వరకు స్న‌ప‌న తిరుమంజ‌నం వైభవంగా జరిగింది. అంత‌కుముందు ఉద‌యం 9.00 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు చ‌తుర్వేద పారాయ‌ణం నిర్వ‌హించారు.

 

అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శ‌నివారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి, మొదలగు ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

 

ఫిబ్ర‌వ‌రి 7న చింత‌చెట్ల‌ వేలం

టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీల‌ప‌ట్లలోని శ్రీ కోనేటిరాయ‌స్వామివారి ఆల‌య ప‌రిధిలో ఉన్న 19 చింత‌చెట్లకు కాసిని చింత‌పండును కోసుకునేందుకు మాత్ర‌మే ఒక సంత్స‌ర కాల‌నికి వేలం నిర్వ‌హించ‌నున్నారు. కీల‌ప‌ట్ల‌లోని ఆల‌య ప్రాంగ‌ణంలో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ 11.00 గంట‌ల‌కు ఇందుకు టిటిడి అట‌వీ విభాగంవారు వేలం నిర్వ‌హించ‌నున్నారు. వేలంలో పాల్గొనేందుకు రూ.2000 ఈఎమ్ఐ చెల్లించ‌వ‌లెను.

 

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి అట‌వీ విభాగం కార్యాలయాన్ని 0877-2264523 నంబరులో సంప్రదించగలరు.

 

Dept Of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——