Today’s Devotional E-Paper -02-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

02/02/2019 , శనివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.44AM

సూర్యాస్తమయం :6.30PM

తిథి :త్రయోదశి 9.42PM

నక్షత్రం :పూర్వాషాఢ12.30AM

యోగం :హర్ష 7.37AM

కరణం :గరజి 9.03AM

వాణి9.42PM

అమృతఘడియలు :7.19PM-9.03PM

వర్జ్యం :8.59AM-10.42AM

దుర్ముహూర్తం
6.44AM-8.15AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.44AM
SunSet :

6.30PM
Tithi :

Thrayodasi 9.42PM
Nakshatram :

Poorvashada 12.30AM
Yogam :

Harsha 7.37AM
Karanam :

Garaji 9.03AM
Vani 9.42PM
AmruthaGadiyalu :

7.19PM-9.03PM
Varjyam :

8.59AM-10.42AM
Durmuhurtham 6.44AM-8.15AM

 

 
*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA
  
     
 TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 01.02.2019 = 56,740.
 VQC SITUATION AT 6.00 AM ON 02-02-2019
 NO.OF COMPARTMENTS WAITING IN VQC-II: 04,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN: UPTO 08 HOURS. 
TONSURES: 18,096.
  PARAKAMANI RS. 2.34 CRORES. 
Dept of PRO TTD

 

02/02/2019 , Saturday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

 

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

07:30 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

ఆన్‌లైన్‌లో 70,786 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

 

 

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన మే నెల కోటాలో మొత్తం 70,786 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 11,486 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 8,091, తోమాల 140, అర్చన 140, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 59,300 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2000, కల్యాణం 14,725, ఊంజల్‌సేవ 4,650, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,425, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 16,200 టికెట్లు ఉన్నాయని వివరించారు.

 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

 

1. హనుమంతరావు – రామదుర్గం, కర్నాటక.

 

ప్రశ్న: వైకుంఠఏకాదశి తదితర ప్రత్యేకపర్వదినాలలో శ్రీవారిసేవకులకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు?

 

ఈవో : టిటిడిలో రోజుకు సాధారణ రోజులలో 1500లకు పైగా, పర్వదినాలలో రోజుకు 3 వేలకు పైగా శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు. పద్దతి ప్రకారం ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం.

 

2. నాగేశ్వరరావు – రాజమండ్రి

 

ప్రశ్న: శ్రీవారికి ఉపయోగించే పుష్పాలను తుంచి వేయరాదని ఎస్వీబీసీ ప్రసారాలలో శ్రీచాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తున్నారు. అయితే ఎస్వీబీసీలో ప్రసారమయ్యే నిత్యపూజలివిగో కార్యక్రమంలో పుష్పాల రెమ్మలను తుంచి వేస్తున్నారు. శ్రీపద్మావతి అమ్మవారి కల్యాణం సందర్భంగా అర్చకులు సంప్రదాయంగా గోచి కట్టకుండా పంచెలు కట్టుకుని వస్తున్నారు?

 

ఈవో : టిటిడిలో కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే జరుగుతాయి. ఈ విషయంపై అర్చకులతో సంప్రదిస్తాం.

 

3. నందగోపాల్‌ – చెన్నై

 

ప్రశ్న: జనవరి 27వ తేదిన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం, జనవరి 31వ తేదిన అమరాతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమాలను చాలా బాగా నిర్వహించారు. ?

 

ఈవో : కృతజ్ఞతలు.

 

4. వేంకటేశ్వరరావు – ఏలూరు

 

ప్రశ్న: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గతంలో కుంకుమ్మపువ్వును ఉపయోగించేవారు, ప్రస్తుతం వాడడం లేదు. దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులకు కరపత్రాలు అందించండి?

 

ఈవో : ప్రస్తుతం టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఇచ్చిన సలహాలు, సూచనలు పరిశీలిస్తాం.

 

5. పుణ్యవతి – పశ్చిమగోదావరి

 

ప్రశ్న: జనవరి 29వ తేదిన ఆన్‌లైన్‌లో తిరుమల గదులు బుక్‌ చేసుకుని వచ్చాం. కేవలం 4 నిమిషాలు ఆలస్యం కావడంతో గదులు కేటాయించలేదు?

 

ఈవో : తిరుమలలో గదులు పరిమితంగా ఉన్నాయి. భక్తులు రోజుకు 60 వేల నుండి 80పైచిలుకు వస్తున్నారు. కావున విధానపరంగా గదులు కేటాయిస్తున్నాం.

 

6. పార్వతి – విజయవాడ

 

ప్రశ్న: తిరుమలలో శ్రీవారి సేవకులను సిబ్బంది చులకనగా మాట్లాడుతున్నారు. ?

 

ఈవో : శ్రీవారి సేవకుల సేవలను రాష్ట్రముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబునాయుడు అభినందించారు. టిటిడిలోని అన్ని విభాగాలలో వీరు అద్భుతమైన సేవలందిస్తున్నారు. త్వరలో వారికోసం నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఒకరిద్దరి మాటలను శ్రీవారి సేవకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

 

7. గాయత్రి, సావిత్రి, గోవిందరాజు – బెంగుళూరు, కళావతి – ఖమ్మం

 

ప్రశ్న: ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులలో తండ్రి దర్శనానికి రాలేని పక్షంలో మరొకరిని అనుమతించిండి, గుండె ఆపరేషన్‌ చేసుకున్న వారికి ప్రత్యేక దర్శనం కల్పించండి, 80 సంవత్సరాలు పైబడిన వారికి ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు కల్పించండి?

 

ఈవో : టిటిడిలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పద్దతి ప్రకారం దర్శనం కల్పిస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు తోపులాటలు జరగకుండా రోజుకు 1400 మందికి వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. నెలలో 2 సాధారణ రోజుల్లో 4 వేల టోకెన్లు అదనంగా జారీ చేస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోండి.

 

8. యతీంద్ర – మచిలీపట్నం, నరసింగారావు – విశాఖపట్నం

 

ప్రశ్న: లక్కీడీప్‌లో సుప్రభాత సేవ వచ్చింది. అయితే నాకు సమాచారం లేకపోవడం వల్ల డబ్బులు చెల్లించలేదు. మరోసారి అవకాశం కల్పిస్తారా, లక్కీడీప్‌లో సేవా టికెట్లు పొందినవారు అనివార్యకారణాల వల్ల రాలేనిపక్షంలో మరొకరికి అవకాశం కల్పించండి?

 

ఈవో : సేవా టికెట్లను పారదర్శకంగా భక్తులకు కేటాయిస్తున్నాం. ఇతరులకు బదలాయించడం సాధ్యంకాదు.

 

9. నాగేశ్వరరావు – నర్సాపురం

 

ప్రశ్న: ఆన్‌లైన్‌లో టిటిడి కల్యాణమండపం బుక్‌ చేసుకున్నాం. అనివార్యకారణాల వల్ల మరోతేదికి మార్చుకోవచ్చా, రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లిస్తారా?

 

ఈవో : సకాలంలో రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కల్యాణమండపం ఖాళీగా ఉండే కేటాయిస్తారు.

 

MORE ROOMS COMING UP AT ALIPIRI TO RESOLVE ACCOMMODATION PROBLEMS TO PILGRIMS IN FUTURE-TTD EO_

To resolve the accommodation problems to pilgrims who are coming to Tirumala, the TTD board has approved to construct 2000 rooms at Alipiri, the gate way to Tirumala in future, said TTD EO Sri Anil Kumar Singhal.The monthly Dial Your EO programme took place at Annamaiah Bhavan in Tirumala on Friday. EO attended to the calls of 17 callers from across different states during the programme. Answering a pilgrim caller Smt Punyavathi from West Godavari district of Andhra Pradesh, who sought EO to consider one hour grace time for the booked rooms in Tirumala if the pilgrim arrives late, to which the EO said, the entire mechanism of accommodation is computerised and the system will automatically allot the accommodation to another pilgrim if the advanced booking pilgrim does not turn up on time. That too in Tirumala, we have in sufficient accommodation. To overcome this problem, the board has recently approved to construct a huge amenities complex for the pilgrim in Alipiri. In the first phase 500 rooms will be constructed”, he added.

 

While caller Smt Parvathi from Vijayawada brought to the notice of EO that the Srivari Sevakulu are degraded by some department staffs while on service duty which is hurting the volunteers to which the EO said, the Srivari Seva volunteers are rendering huge services to pilgrims. Even the Honourable CM of AP Sri N Chandra Babu Naidu complimented the impeccable services of Srivari Sevakulu during Bhookarshana puja held at Amaravathi on January 31. “So there is no need to feel hurt just because of the different approach of a few staff. However we instruct them to behave properly with volunteers”, he said.

 

Another caller Sri Venkateswara Rao from Eluru informed EO that saffron (Kumkuma Puvvu) is not utilized in prasadams which used to be in olden days.The EO said, the management will not interfere in religious issues however this will be discussed with the religious staff.

 

Caller Sri Yatindra from Machilipatnam said that he got a Suprabhatam ticket in lucky dip but did not get any SMS or mail from TTD and he lost the ticket. EO said, if the problem is a Technical issue we will definitely rectify it.

 

A caller from Rajamundry Sri Nageswara Rao said, that in SVBC Nityapujalivigo programme, the pooja to deities is being rendered by splitting every petal of the flower while renowned Religious Scholar Sri Chaganti Koteswara Rao in his discourse negates splitting of petals and offering to Lord to which the EO said, they will discuss the issue with religious scholars.

 

 

 డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

 

 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతిలో శ్రీవారి ఆలయం :

అమరావతిలో రూ.150 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి జనవరి 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ||శ్రీనారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఆగమోక్తంగా భూకర్షణం నిర్వహించాం. శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయం నిర్మాణానికి సిఆర్‌డిఏ 25 ఎకరాల స్థలం ఉచితంగా కెేటాయించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పవిత్ర కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విచ్చేసిన వేలాది మంది శ్రీవారి సేవకులు, భజన మండలి సభ్యులు, స్థానికులు, టిటిడి సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 10వ తేదీన ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది. 6 ఎకరాలలో శ్రీవారి ఆలయం, ఏడాదంతా ధార్మిక కార్యక్రమాలు జరిగేలా మిగిలిన 19 ఎకరాలలో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాం.

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం:

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 27వ తేదీన విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించాం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుటున్నారు.

హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయం :

హైదరాబాద్‌లో రూ.28 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయంలో మార్చి 13న విగ్రహప్రతిష్ఠ జరుగనుంది.

ఫిబ్రవరి 12న రథసప్తమి :

– ఫిబ్రవరి 12న సూర్యజయంతిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో రథసప్తమి

ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు వైభవంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా ఒకేరోజు 7 ప్రధాన వాహనాలపై శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిని ఒకరోజు బ్రహ్మూెత్సవంగా వ్యవహరిస్తారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ప్రణాళికాబద్ధంగా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రత్యేక దర్శనాలు :

ఫిబ్రవరి 5, 19వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం. ఫిబ్రవరి 6,20వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని 10 అతిథి భవనాలలో చాపలు, దిండ్లు, రగ్గులు మరియు దుప్పట్లు అదనంగా అందిస్తున్నాం.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం.

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయం :

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి విశేషమైన ప్రాశస్త్యముంది. శ్రీ కపిలముని తపస్సుకు మెచ్చి పరమశివుడు లింగ రూపంలో స్వయంభువుగా అవతరించారు. ఈ కారణంగా ఇక్కడి స్వామివారికి శ్రీ కపిలేశ్వరస్వామి అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని రోజుకు దాదాపు 3 వేల నుండి 4 వేల మంది, సోమవారంనాడు 5 వేల నుండి 6 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నెలకు సుమారు రూ.8 లక్షల హుండీ ఆదాయం లభిస్తోంది. ఆర్జిత సేవల నిర్వహణ ద్వారా నెలకు సుమారు రూ.6 లక్షలు లభిస్తోంది.

ఆలయంలో బ్రహ్మూెత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, కార్తీక సోమవారాలు,కార్తీక దీపోత్సవం, విశేష హోమాలు, అన్నాభిషేకం తదితర ప్రత్యేక రోజుల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాం.

అభివృద్ధి పనులు :

గతంలో రూ.80 లక్షలతో స్వామివారి దర్శనానంతరం భక్తులు వెలుపలికి వచ్చేందుకు వీలుగా క్యూలైన్‌ బ్రిడ్జి, పుష్కరిణి నుండి వచ్చే నీరు వాగులోనికి ప్రవహించేందుకు కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌, జలపాతం వద్ద భక్తులు జారకుండా ఉండేందుకు కట్‌స్టోన్‌ ఫ్లోరింగ్‌, ఆర్జితసేవా టికెట్‌ కౌంటర్‌ నిర్మించాం.

ఈ ఏడాది రూ.60 లక్షలతో కల్యాణకట్ట, కార్యాలయ భవనం, పాదరక్షల కౌంటర్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టాం.అదేవిధంగా మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఆలయ గోపురం, మండపాల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.

దర్శనం :

– గతేడాది జనవరిలో 20.43 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జనవరిలో 21.3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జనవరిలో రూ.81.88 కోట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ.86.12 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది జనవరిలో 49.08 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జనవరిలో 43.86 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :

– గతేడాది జనవరిలో 83.49 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జనవరిలో 94.47 లక్షల లడ్డూలను అందించాం.

 

ALL SET FOR RADHA SAPTHAMI ON FEB 12_

TTD is gearing up for the yet another big festival Radhasapthami which is scheduled on February 12, said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media persons in Annamaiah Bhavan on Friday the EO said, Sri Malayappa Swamy will take celestial ride on seven different vahanams on the auspicious day.

Later the EO said, on February 5 and 19 TTD will issue 4000 tokens to senior citizens and physically challenged persons while on February 6 and 20 to parents with children below 5years of age.Both the events of Maha Kumbhabhishekam for the temple at Kanya kumari and Bhookarshana for the temple at Amaravathi went off in a successful manner, he informed.

 

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti, CE Sri Chandrasekhar Reddy were also present.

 

అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణ ప్రాంతంలో వైభవంగా శ్రీనివాసుడి వసంతోత్సవం

 

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూక‌ర్ష‌ణంలో భాగంగా శుక్ర‌వారం వ‌సంతోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు టిటిడి ఆధ్యాత్మిక, ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.

ఇందులో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంతఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామి

కి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

 

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శుక్ర‌వారం శోభాయమానంగా జరిగింది. ఇందులో ముందుగా
విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు. గంధంతో స్వామి,అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌పనం నిర్వహించారు. అంత‌కుముందు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం నిర్వహించారు.ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

కాగా, ఫిబ్రవరి 2వ తేదీ గురువారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.ఫిబ్రవరి 3 నుండి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం, మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు భక్తి సంగీతం, సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. మొదటిరోజు ఋగ్వేదం, రెండో రోజు యజుర్వేదం, మూడో రోజు సామవేదం, నాలుగో రోజు అధర్వణ వేదం పారాయణం చేస్తారు.

రాష్ట్ర అభివృద్ధి, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 7న సాయంత్రం ఆచార్యవరణం, అంకురార్పణ, ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, ఫిబ్రవరి 10న ఉదయం చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, గోగణ నివేదనం, ఉదయం 9 నుండి 10 గంటల వరకు మీన లగ్నంలో ప్రథమ శిలేష్ఠకాన్యాసం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Dept Of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——