Today’s Devotional E-Paper -01-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

01/02/2019 , శుక్రవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం:శుక్ల

సూర్యోదయం:

6.44AM

సూర్యాస్తమయం :

6.30PM

తిథి
:

ద్వాదశి
8.24PM

నక్షత్రం
:

మూల
10.39PM

యోగం
:

వ్యాఘా
7.58AM

కరణం
:

కౌలవ
7.58AM
తైతుల
8.24PM

అమృతఘడియలు
:

3.51PM-5.33PM

వర్జ్యం
:

7.23AM
8.57PM-10.39PM

దుర్ముహూర్తం
9.01AM-7.47AM
12.50PM-1.36PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

01/02/2019 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Magha Masam

Paksham :

Sukla

SunRise :

6.44AM

SunSet :

6.30PM

Tithi :

Dwadasi 8.24PM

Nakshatram :

Moola 10.39PM

Yogam :

Vyagha 7.58AM

Karanam :

Koulava 7.58AM
Taitula 8.24PM

AmruthaGadiyalu :

3.51PM-5.33PM

Varjyam :

7.23AM

8.57PM-10.39PM

Durmuhurtham 9.01AM-7.47AM

12.50PM-1.36PM

 

01/02/2019 , Friday
02:30-03:00 hrs
Suprabhatam
03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam
04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam
06:00 – 07:00 hrs
Samarpana
07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)
09:00 – 20:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.
20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
21:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

 

 

అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌యం మ‌న అదృష్టం…. ఆల‌య నిర్మాణానికి టిటిడికి ఉచితంగా 25 ఎక‌రాలు కేటాయింపు…. రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు…. ఆల‌య స్థలంలో వైభ‌వంగా భూక‌ర్ష‌ణం, బీజావాప‌నం

 

ప్ర‌పంచానికి శాంతిని, సుభిక్షాన్ని ప్ర‌సాదించే దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార‌ని, అలాంటి శ్రీ‌వారి ఆల‌యం అమ‌రావ‌తిలో నిర్మాణం కావ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు ఉద్ఘాటించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య నిర్మాణానికి సిఆర్‌డిఏ నుండి 25 ఎక‌రాల స్థ‌లాన్ని టిటిడికి ఉచితంగా కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాళెంలో గురువారం నాడు గౌ.. ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఆగ‌మోక్తంగా భూక‌ర్ష‌ణం, బీజావాప‌నం కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. 
             ఈ సంద‌ర్భంగా గౌ.. ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ అమరావతి నేలలోనే ఏదో విశేషం ఉందని, అందుకే ఈ భూమి చరిత్రలో రెండుసార్లు రాజధానిగా నిలిచిందని తెలిపారు. క్రీ.శ 2వ శతాబ్దంలో శాతవాహనుల రాజధానిగా, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగా అమరావతి విరాజిల్లింద‌ని, ఇప్పుడు మరోసారి నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా మారిందని వివ‌రించారు. ప్రజారాజధానిగా శంకుస్థాపన జరిగిన వేళ దేశం నలుమూలల్లోని దివ్య క్షేత్రాలు, పుణ్యతీర్ధాల నుంచి తెచ్చిన పవిత్రమైన మట్టి, జలాలతో ఈ నేల ఇప్పటికే పునీతమైంద‌ని, ఇప్పుడు ఒక మహా పుణ్యక్షేత్రమే కొలువుతీర‌డం శుభకరమ‌న్నారు. ఈ పవిత్రమైన దైవకార్యం త‌న‌ చేతుల మీదుగా జరగడం పూర్వ‌జ‌న్మ‌సుకృతమ‌న్నారు. త‌న చేతుల మీదుగా ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరపాలని ఆ దేవుడు సంకల్పించి ఉంటార‌ని, అందుకే 2003లో అలిపిరి ఘటనలో త‌న‌కు బోనస్ జీవితాన్ని ప్రసాదించార‌ని అన్నారు. నూత‌న రాజ‌ధానిలో కృష్ణా న‌ది తీరాన ఒక వైపు దుర్గ‌మ్మ‌, మ‌రోవైపు శ్రీ‌వారు ఉన్నార‌ని, ఈ ఇద్ద‌రి ఆశీస్సులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంద‌ని పేర్కొన్నారు. శ్రీ‌వారి దివ్యాశీస్సుల‌తోపాటు ఆ ప్రాంతంలోని కూచిపూడి నృత్యాన్ని ప్ర‌పంచానికి అందించేందుకు కృషి జ‌రుగుతోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు, జీవ‌న‌ప్ర‌మాణాలు పెంచేందుకు శ‌క్తిని ఇవ్వాల‌న ప్ర‌తిరోజూ స్వామివారిని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. శ్రీ‌వారిని కొలిస్తే మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఆనందం చేకూరుతాయ‌న్నారు. భూకర్షణంలో భాగంగా ఆగమశాస్త్ర బద్ధంగా భూమిని దున్ని ధాన్యం చల్లుతారని, ధాన్యం మొలకలను గోవులు మేసిన తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తారని వివ‌రించారు. 
          అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానములు రూ.150 కోట్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందని, ఈ ఆలయ స్థలానికి స్టాంపు రుసుం, రిజిస్ట్రేషన్‌ రుసుం నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చామ‌ని,  త‌ద్వారా టిటిడికి కోటి రూపాయలకు పైగా ప్రయోజనం కలిగిందని గౌ.. ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ఈ స్థలంలో ఇప్పుడు జరుగుతున్న వైదిక కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయ‌న్నారు. రెండేళ్ల కాలంలో  అంతర ప్రాకారం, బాహ్య ప్రాకారం, మహారాజ గోపురం, కల్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం తదితర నిర్మాణాలన్నీ పూర్తవుతాయ‌ని తెలిపారు.
శ్రీవారి సేవ – స్వచ్ఛంద సేవ :
           తిరుమలలో శ్రీవారి సేవ చేసేందుకు సామాన్యులకు గొప్ప అవకాశం కల్పించార‌ని, శ్రీవారి సేవ పేరుతో వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 6.33 లక్షల మంది, తెలంగాణ నుంచి 1.06 లక్షల మంది శ్రీవారి సేవకులు సేవలందించారని చెప్పారు. తిరుమలలో సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 1500 మంది, పర్వదినాలలో నిత్యం మూడు వేల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తుండ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, ఫుడ్‌ కౌంటర్లు, తిరునామధారణ తదితర విభాగాల్లో శ్రీవారి సేవకులు చ‌క్క‌గా భక్తులకు సేవలందిస్తున్నార‌ని, ఈ సంద‌ర్భంగా వారికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. డాక్ట‌ర్లు త‌దిత‌ర వృత్తి నిపుణులు కూడా తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించాల‌ని కోరారు. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో దాదాపు రూ.100 కోట్లతో నూతన భవనం త్వరలో ప్రారంభం కానుందన్నారు. 
హిందూ ధర్మ ప్రచార పరిషత్ : 
           సనాతన ధర్మ పరిరక్షణ, పరివ్యాప్తి కోసం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ను ఏర్పాటుచేసింద‌ని, ఆంధ్రప్రదేశ్‌లో 86,925 మంది, తెలంగాణలో 26,670 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
ఒంటిమిట్టలో రామాలయ అభివృద్ధి :
           టిటిడి ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారని, ఇందులో రూ.60.65 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయ‌ని వివ‌రించారు.
దేశంలో వివిధ నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం:  
              హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ.34.60 కోట్లతో, తమిళనాడులోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించార‌ని, హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయంలో మార్చి 13న విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నంలో రూ.7.90 కోట్లతో, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయ‌న్నారు. చెన్నైలో రూ.5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రూ.7.5 కోట్లు వ్య‌యంతో నిర్మించ‌నున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండ‌ర్లు పూర్త‌య్యాయ‌ని, కోల్‌కతాలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఓ దాత 3 ఎకరాల స్థలం ఇవ్వడానికి అంగీకరించారని వెల్ల‌డించారు.
                ఈ కార్యక్రమంలో ఎపి శాసనసభ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పి.నారాయణ, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీ‌మ‌తి ప‌రిటాల సునీత‌, శ్రీ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ జ‌వ‌హ‌ర్‌, శ్రీ సిద్ధా రాఘ‌వ‌రావు, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ డొక్కా జ‌గ‌న్నాథం, శ్రీ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ బికె.పార్థ‌సార‌ధి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ‌మ‌తి స‌త్య‌ప్ర‌భ‌, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ‌మ‌తి సుగుణ‌మ్మ‌, టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆగ‌మోక్తంగా భూకర్షణం
శ్రీ‌నివాస క‌ల్యాణంతో పుల‌కించిన భ‌క్తులు
గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిన ఆల‌యనిర్మాణ స్థ‌లం
    ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణం కోసం గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.. శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు చేతుల‌మీదుగా ఆగ‌మోక్తంగా భూకర్షణం, బీజావాపనం కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య మీనలగ్నంలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. వేదిక వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.. ముఖ్య‌మంత్రి ముందుగా ఆల‌య నిర్మాణ విశిష్ట‌త‌, మాస్ట‌ర్ ప్లాన్‌తో రూపొందించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను తిల‌కించారు. ఆల‌య నిర్మాణ న‌మూనాను సంద‌ర్శించారు.
             
            ఈ సంద‌ర్భంగా ఉదయం చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు జ‌రిగాయి. ఆ త‌రువాత గ‌ర్భాల‌య నిర్మాణ స్థ‌లం వ‌ద్ద‌ నాగ‌ళి పూజ‌, వృషభపూజలు చేప‌ట్టారు. గ‌ర్భాల‌య నిర్మాణ స్థ‌లంలో నాగ‌ళితో దున్ని మొల‌కెత్తిన న‌వ‌ధాన్యాల‌ను చ‌ల్లారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో పూర్ణాహుతి జ‌రిగింది. అనంత‌రం గౌ.. ముఖ్య‌మంత్రికి వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి పెద్ద‌జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. నిర్మాణం పూర్త‌యిన త‌రువాత శ్రీ‌వారి ఆల‌యం త‌ర‌హాలో ఇక్క‌డి ఆల‌యంలో సుప్ర‌భాతం నుండి ఏకాంత‌సేవ వ‌ర‌కు అన్ని కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆలయ ప్రాంగ‌ణంలో శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామి, శ్రీ విష్వ‌క్సేనులవారు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్ఠిస్తామ‌న్నారు. 
వైభ‌వంగా శ్రీ‌నివాస క‌ల్యాణం
              భూకర్షణ, బీజావాపన కార్య‌క్ర‌మాల అనంత‌రం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా జ‌రిగింది. శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని క‌ల్యాణాన్ని వీక్షించిన అమ‌రావ‌తి ప్ర‌జ‌లు త‌న్మ‌య‌త్వంతో పుల‌కించిపోయారు. భ‌క్తుల గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య నిర్మాణ స్థ‌లం ప‌రిస‌రాలు మారుమోగాయి. 
             శ్రీ‌నివాస క‌ల్యాణంలో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురారోప‌ణ‌, ర‌క్షాబంధ‌నం – కంక‌ణ‌ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, మ‌ధుప‌ర్కం, మ‌హాసంక‌ల్పం – గోత్ర‌నామాలు చెప్పుకోవ‌డం, క‌న్యాదానం, మాంగ‌ళ్య‌ధార‌ణ‌, హోమాలు, పూల‌మాల‌లు మార్చుకోవ‌డం, అక్ష‌తారోప‌ణం, నీరాజనం ఘ‌ట్టాల‌ను శాస్రోక్తంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆయా ఘ‌ట్టాల‌కు అనుగుణంగా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా ఆల‌పించారు. 
              ఈ భూక‌ర్ష‌ణం కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 3 వేల మంది శ్రీవారిసేవకులు, దాస‌సాహిత్య ప్రాజెక్టు నుండి 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ నుండి 3500 మంది భ‌జ‌న‌మండ‌ళ్ల క‌ళాకారులు, అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. భ‌క్తులంద‌రూ భూక‌ర్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని, శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని తిల‌కించేలా ఎల్ఇడి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటుచేశారు. టిటిడి ఇంజినీరింగ్ అధికారులు భారీ స‌భా ప్రాంగ‌ణాన్ని, హోమ వేదిక‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి. 
భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు…
                   ఈ భూక‌ర్ష‌ణం కార్యక్రమానికి విచ్చేసిన భ‌క్తుల‌కు, శ్రీ‌వారి సేవ‌కుల‌కు, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యుల‌కు, క‌ళాకారుల‌కు టిటిడి ఉచితంగా అన్న‌ప్ర‌సాదాలు అందించింది. సాంబార‌న్నం, పెరుగ‌న్నం త‌దిత‌ర అన్న‌ప్ర‌సాదాలు, చ‌ట్ని, సాంబారుతో క‌లిపి పొంగ‌ళి, ఉప్మా త‌దిత‌ర అల్పాహారం, తాగునీటి వ‌స‌తి క‌ల్పించారు.
ఫొటో ఎగ్జిబిష‌న్‌
                 టిటిడి ప్ర‌జాసంబంధాల విభాగం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ఎక్కువ‌మంది భ‌క్తులు తిల‌కించారు. పెద్ద సైజుల్లో క‌నువిందు క‌లిగేలా స్వామివారి ఫొటోల‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆనంద‌నిల‌యం, పంచ‌బేరాలు, అలిపిరి, శ్రీ‌వారి సేవ‌లు, టిటిడి ట్ర‌స్టులు, శ్రీ‌వారి సేవ‌కులు తదిత‌ర ఫొటోలున్నాయి. అదేవిధంగా టిటిడి వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు.
                ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ డొక్కా జ‌గ‌న్నాథం, శ్రీ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ బికె.పార్థ‌సార‌ధి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ రాములు, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డిఎఫ్వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, ర‌వాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఆచార్య‌ బి.విశ్వ‌నాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————-
భూక‌ర్ష‌ణంలో ఉత్సాహంగా పాల్గొన్న శ్రీ‌వారి సేవ‌కులు, భ‌జ‌న‌మండ‌ళ్లు
            అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాళెంలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణం కోసం గురువారం నాడు నిర్వ‌హించిన‌ భూక‌ర్ష‌ణం కార్య‌క్ర‌మంలో గుంటూరు, కృష్ణా జిల్లాల‌తో పాటు రాష్ట్రం న‌లుమూల‌ల నుండి శ్రీ‌వారి సేవ‌కులు, భ‌జ‌న‌మండ‌ళ్ల స‌భ్యులు, క‌ళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స‌భావేదిక వ‌ద్ద ఉద‌యం  5 గంట‌ల నుండి భ‌జ‌న‌లు, గోవింద‌నామాల‌తో మారుమోగించారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన భ‌క్తులు కూడా వారితో గ‌ళం క‌లిపి త‌న్మ‌య‌త్వానికి లోన‌య్యారు.
            గౌ.. ముఖ్య‌మంత్రివ‌ర్యులు త‌మ ప్ర‌సంగంలో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను ప్ర‌త్యేకంగా కొనియాడారు. డాక్ట‌ర్లు త‌దిత‌ర వృత్తి నిపుణులతోపాటు మ‌రింత మంది టిటిడిలో శ్రీ‌వారి సేవ‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. గౌ.. ముఖ్య‌మంత్రి ప్ర‌సంగంపై శ్రీ‌వారి సేవ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా, టిటిడిలో 2000వ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన శ్రీ‌వారి సేవ‌లో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలోని 18 రాష్ట్రాల నుండి 10 ల‌క్ష‌ల మందికిపైగా శ్రీ‌వారి సేవకులు సేవ‌లందించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 6.33 లక్షల మంది, తెలంగాణ నుంచి 1.06 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. తిరుమలలో సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 1500 మంది, పర్వదినాలలో నిత్యం మూడు వేల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, ఫుడ్‌ కౌంటర్లు, తిరునామధారణ తదితర విభాగాల్లో శ్రీవారి సేవకులు చ‌క్క‌గా భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో దాదాపు రూ.100 కోట్లతో నూతన భవనం త్వరలో ప్రారంభం కానుంది.
            కాగా, సనాతన ధర్మ పరిరక్షణ, పరివ్యాప్తి కోసం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 86,925 మంది, తెలంగాణలో 26,670 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ భూక‌ర్ష‌ణం కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 3 వేల మంది శ్రీవారిసేవకులు, దాస‌సాహిత్య ప్రాజెక్టు నుండి 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ నుండి 3500 మంది భ‌జ‌న‌మండ‌ళ్ల క‌ళాకారులు, అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

BHOOKARSHANAM AND BEEJAAVAPANAM PERFORMED

 

GRAND RELIGIOUS START TO SRI VENKATESWARA DIVYAKSHETRAM AT AMARAVATHI

 

AMARAVATHI, 31 January 2019: The construction of Sri Venkateswara Divyakshetram at Venkatapalem in Tullur mandal of Guntur district commenced on a religious note with Bhookarshanam and Beejaavapanam events on Thursday.

 

The Honourable CM of Andhra Pradesh Sri N Chandrababu Naidu took the plough after performing puja to it and dug the area by tying the plough to the bulls amidst the chanting of Veda mantras. The area earmarked for the construction of the temple with Garbhagriha was made pious and ready.

 

Later the Beejaavapanam was carried out where different varieties of grains were carried in Palikas (mud pots) were down in the ploughed soil by the head of the state.

 

Earlier the CM was explained by TTD EO Sri Anil Kumar Singhal, about the features of the upcoming temple through a conceptual sketch on giant LED screen. Later the CM was also shown the model of the temple with Mahagopuram, inner and outer prakarams, addala mandapam, potu etc.

 

APLA Speaker Sri Kodela Sivaprasad Rao, Ministers Sri Pulla Rao, Sri Somireddy Chandramohan Reddy, Smt Sunitha, Sri Jawahar, Sri Devineni Uma Maheswara Rao, Sri Sidda Raghavarao, TTD Chairman Sri Putta Sudhakar Rao, TTD Board Member Sri Rudraju Padma Raju, Sri Peddi Reddy, Sri Bonda Uma Maheswara Rao, Sri Dokka Jaganadham, Sri BK Saradhi, Sri Ramesh Babu, Spl Invitees Sri Raghavender Rao, MLAs, Smt Suguna, Smt Satyaprabha, TTD JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Gopinath Jetti and others took part.

SUPREME LORD TO COME UP IN AMARAVATHI IN NEXT TWO YEARS-HONOURABLE CM OF AP

AMARAVATHI, 31 January 2019: The ultimate lord of Kaliyuga is Lord Venkateswara and the temple of the Supreme almighty is all set to come up in Amaravathi in the next couple of years, said Sri N Chandra Bahu Naidu, the Honourable CM of Andhra Pradesh.

The Honourable CM of the state took part in the Bhookarshanam and Beejaavapanam ceremony which took place in the auspicious Meena Lagnam between 9.15am to 9.40am in the village of Venkatapalem. 


SPREADING VENKATESWARA BHAKTI CULT

After the ceremony the CM addressed the huge gathering of devotees comprising local devotees, Srivari Seva volunteers, Dasa artistes, Hindu Dharma Prachara troupes from across the state of AP. He said the temple of Sri Venkateswara Swamy in Venkatapalem will come up in next couple of years. The intention is to spread Venkateswara Bhakti cult across the country. Temples have already come in to existence in Kurukshetra, Kanya kumari and are in offing at Hyderabad, Kolkata, Bhubaneswar and also coming up in agency areas like Sitampeta, Parvathipuram, Rampachodavaram etc.I “Adding further he said, “I feel blessed for having performed Bhoomipooja for the capital city of Andhra Pradesh, Amaravathi and for taking part in Bhookarshanam for Sri Venkateswara temple today”, he maintained.

SRIVARI SEVAKULU SHOULD ACT THE TORCH BEARERS OF HINDU SANATANA DHARMA

Complimenting the services of Srivari sevakulu, the CM said, the volunteers are doing impeccable services at different places in Tirumala like in managing queue lines at Vaikuntham Complex, outside lines inside temple, at Anna prasadam complex, laddu counters, parakamani and at different places in Tirumala and Tirupati. So far 6.33 lakh srivari Sevakulu from Andhra Pradesh have rendered service in Srivari Seva since 2000. The sevakulu should take forward the Hindu Sanatana Dharma ahead in future by taking part in dharmic services. A twin building for srivari sevakulu at Rs.100crores was also constructed by TTD. He said that Bhajana artistes from HDPP, Dasa Sahitya projects of TTD are also doing spiritual services by reciting keerthanalu.

AMARAVATHI TEMPLE TO BE A PRESTIGIOUS ONE

The temple which is to come up in 25 acres of land in Amaravathi in the next two years at a cost of Rs.150 crores is going to be a prestigious one.

ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– ఫిబ్రవరి ఫిబ్ర‌వరి 3 నుండి 5వతేదీ వరకు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు.
– ఫిబ్రవరి 12న ర‌థ‌స‌ప్త‌మి.
– ఫిబ్రవరి 16న భీష్మ ఏకాదశి.
– ఫిబ్రవరి 17న శ్రీ కులశేఖరాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.
– ఫిబ్రవరి 19న కుమార‌ధార తీర్థ ముక్కోటి.

Dept Of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——